హర్మూజ్‌ జలసంధి వద్ద చిక్కుకున్న భారత నావికులు...బయటకు రావద్దంటూ డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ షిప్పింగ్ ఆదేశాలు

ఇరాన్, అమెరికా దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరిగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మొదట ఇరాన్ హర్మూజ్ జలసంధిని తెరిచింది.ఇంతలో లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడికి పాల్పడింది. ఈ నేపథ్యంలో పశ్చిమాసియాలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. దీంతో హర్మూజ్ జలసంధిని మళ్లీ మూసివేస్తున్నట్లు ఇరాన్ ప్రకటించింది. ఈ క్రమంలో జలసంధిని దాటేందుకు వచ్చిన నౌకలు తిరుగుముఖం పట్టాయి. ఈ క్రమంలో హర్మూజ్ జలసంధి వద్ద చిక్కుకుపోయిన భారత నావికులకు కేంద్ర ప్రభుత్వం కీలక అడ్వైజరీ జారీ చేసింది. ఈ మేరకు డైరెక్టర్ జనరల్ ఆఫ్ షిప్పింగ్ ఒక ప్రకటనను విడుదల చేసింది. పశ్చిమాసియాలో యుద్ధం నేపథ్యంలో భద్రతా కారణాల వల్ల ఇరాన్, దాని పరిసర జలాల్లో చిక్కుకుపోయిన నావికులు సున్నితమైన ప్రదేశాలకు దూరంగా ఉండాలని సూచించింది., News News, Times Now Telugu