ఇంజినీరింగ్ కొత్త సీట్లపై సస్పెన్స్.. విద్యాశాఖ దగ్గరే ఫైలు పెండింగ్!
రాష్ట్రంలో ఇంజినీరింగ్ అడ్మిషన్ల ప్రక్రియ కొనసాగుతున్నా.. కొత్త సీట్ల వ్యవహారం మాత్రం ఇంకా కొలిక్కి రాలేదు. ఏఐసీటీఈ ఎప్పటిలాగే కొత్త సీట్లకు అనుమతులు ఇచ్చినా రాష్ట్ర విద్యాశాఖ వద్దే ఆ ఫైలు ఆగిపోయింది.