తెలంగాణలో కొత్త పథకం.. 1.44 లక్షల మందికి లబ్ధి, రేపట్నుంచి ప్రారంభం

తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో విద్యార్థులకు ఉచిత బ్రేక్‌ఫాస్ట్‌ అందించే ప్రతిష్ఠాత్మక పథకానికి జూన్ 15న ప్రభుత్వం శ్రీకారం చుట్టనుంది. తొలి విడతగా 1,302 విద్యాసంస్థల్లో 1,44,610 మంది విద్యార్థులకు వారంలో ఆరు రోజులు పౌష్టికాహారం అందజేస్తారు. కొత్త విద్యా సంవత్సరంలో ఈ పథకాన్ని రాష్ట్రవ్యాప్తంగా 22 లక్షల మంది విద్యార్థులకు విస్తరించనున్నారు. ఇందుకోసం రూ.720 కోట్లు కేటాయించగా.. రూ.299.90 కోట్లతో 39 కేంద్రీకృత కిచెన్లను నిర్మిస్తున్నారు. దీంతో పాటు ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో చదివే 1.70 లక్షల మంది ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకాన్ని కూడా విస్తరిస్తున్నారు.