నాంపల్లి ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్‌లో అగ్నిప్రమాదం:ఓటుకు నోటు కేసు కోసమేనా? అంటూ కేటీఆర్ సంచలన ఆరోపణలు

నాంపల్లిలో ఉన్న స్టేట్ ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ (FSL)లో జరిగిన అగ్నిప్రమాదం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. మంటలు తీవ్రత తీవ్రంగా ఉండటంతో ఆందోళణ కలిగిస్తోంది.పలు కీలకమైన కేసులకు సంబంధించి ఆధారాలు కాలి బూడిదైనట్లు తెలుస్తోంది. అయితే ఈ ఫోరెన్సిక్ ల్యాబ్ ఫైర్ యాక్సిడెంట్ పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ వేదికగా స్పందించారు.ఓట్ ఫర్ నోట్ కేసుకు సంబంధించిన వాయిస్ రికార్డింగ్‌లను, ఫోన్ ట్యాపింగ్ కేసులో కాంగ్రెస్ ప్రభుత్వం పుట్టించిన తప్పుడు ఆధారాలను కప్పిపుచ్చడానికి ప్రయత్నంగా అనుమానిస్తున్నట్లు కేటీఆర్ ఎక్స్ వేదికగా వెల్లడించారు. మరోవైపు మంటలను అదుపులోకి తీసుకువచ్చినట్లు సెంట్రల్ జోన్ డీసీపీ శిల్ప వల్లి తెలిపారు. ఈ ప్రమాదంలో కీలకమైన ఫైల్స్ దగ్ధం అయినట్లు తెలుస్తోందని అయితే ఏ ఫైల్స్ తగలబడ్డాయో ఇంకా స్పష్టత రాలేదు అని సెంట్రల్ జోన్ డీసీపీ శిల్ప వల్లి పేర్కొన్నారు., News News, Times Now Telugu