ఫాలోవర్స్ పెంచుకోవడం కోసం పట్టాలపై పడుకుంటే.. సాహస యువకుడికి ‘సన్మానం’..!

లైకుల కోసం ప్రాణాలను పణంగా పెట్టడం.. వ్యూస్ కోసం మృత్యువుతో చెలగాటం ఆడటం నేటి యువతకు ఒక వ్యసనంలా మారింది. అచ్చంగా ఇలాంచి పిచ్చి పనే చేశాడో యువకుడు. అందుకోసం ఏకంగా మృత్యువు నోట్లో తలపెట్టి వచ్చాడు. అయితే అక్కడి నుంచి నేరుగా ఆయన జైలు ఊచల్లోకి వెళ్లడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. రైలు పట్టాల మధ్య పడుకుని.. వేగంగా వెళ్తున్న రైలు వీడియో తీసిన ఇతడు.. క్షణాల్లోనే వైరల్ అయ్యాడు. చిన్నపాటి సెలబ్రిటీలా మారిపోయి తెగ మురిసిపోయాడు. చివరకు పోలీసులకు చిక్కి కంటతడి పెడుతున్నాడు.