భర్త వద్దు పార్టీయే ముద్దు: బీజేపీకి వెన్నుపోటు పొడిచావని భర్తను వదిలేసిన మాజీ మేయర్!

నాగ్‌పూర్ రాజకీయాల్లో ఒక అరుదైన, ఆశ్చర్యకరమైన ఘటన చోటుచేసుకుంది. రాజకీయాల్లో విబేధాలు సహజమే కానీ.. పార్టీ పట్ల ఉన్న అచంచలమైన విధేయత ఒక భార్యాభర్తల మధ్య చిచ్చు పెట్టింది. నాగ్‌పూర్ మాజీ మేయర్ అర్చన దేహంకర్ తన భర్త వినాయక్ దేహంకర్ బీజేపీపై తిరుగుబాటు చేసి స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగడాన్ని సహించలేకపోయారు. పార్టీయే నాకు గుర్తింపునిచ్చింది.. దానికి వ్యతిరేకంగా వెళ్లడం అన్యాయం అని వాదిస్తూ.. తన భర్త ఇంటిని వదిలేసి పుట్టింటికి వెళ్లిపోయారు. అలాగే భర్తకు వ్యతిరేకంగా, పార్టీ టికెట్ ఇచ్చిన వ్యక్తికి మద్దతుగా ప్రచారం కూడా చేస్తానని పేర్కొన్నారు.