మద్యం మత్తులో ASI బీభత్సం.. ఎమ్మెల్యే కాన్వాయ్‌ను ఢీకొట్టిన పోలీసుల కారు, నలుగురు సిబ్బంది సస్పెండ్

రక్షక భటులే భక్షకులుగా మారిన వైనం గురుగ్రామ్‌లో కలకలం రేపింది. కొత్త ఏడాది వేడుకల వేళ ప్రజలకు రక్షణగా ఉండాల్సిన పోలీసులే.. మద్యం మత్తులో తూగుతూ ఏకంగా ఎమ్మెల్యే కాన్వాయ్‌నే ఢీ కొట్టారు. విధులను గాలికొదిలేసి.. నంబర్ ప్లేట్ లేని ప్రైవేట్ కారులో ఏఎస్ఐ బల్జీత్ సింగ్ తన సహచరులతో కలిసి బయటకు వెళ్లగా.. తిరిగు ప్రయాణంలో అతి వేగంగా వచ్చి స్థానిక ఎమ్మెల్యే ముఖేష్ శర్మ భద్రతలో ఉన్న పైలట్ వాహనాన్ని బలంగా ఢీకొట్టారు. ఈ ఘటనలో భద్రతా సిబ్బంది గాయపడటంతో పోలీస్ శాఖ తీవ్రంగా స్పందించింది.