"తైవాన్‌పై సైనిక ఒత్తిడి ఆపండి": యుద్ధ విన్యాసాల వేళ చైనాకు అమెరికా వార్నింగ్

ప్రపంచం కొత్త ఏడాది వేడుకల్లో ఉండగానే.. తైవాన్ జలసంధిలో యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. జస్టిస్ మిషన్-2025 పేరుతో చైనా చేపట్టిన భారీ సైనిక విన్యాసాలు అంతర్జాతీయంగా పెను సంచలనాన్ని రేపాయి. తైవాన్ చుట్టూ 27 క్షిపణులను ప్రయోగించిన చైనా ఏకంగా 10 క్షిపణులను తైవాన్ తీరానికి అత్యంత సమీపంలోకి పంపడంతో ఉద్రిక్తతలు పరాకాష్టకు చేరాయి. ఈ పరిణామాలను తీవ్రంగా పరిగణించిన అగ్రరాజ్యం అమెరికా.. గురువారం చైనాకు బలమైన హెచ్చరిక జారీ చేసింది. తైవాన్‌పై అనవసరమైన సైనిక ఒత్తిడిని పెంచడం తక్షణమే ఆపి, శాంతియుత చర్చలకు ప్రాధాన్యత ఇవ్వాలని డిమాండ్ చేసింది.