మారనున్న ప్రభుత్వ వైద్యం రూపురేఖలు.. ప్రాంతీయ ఆసుపత్రుల్లో ఆధునిక పరికరాలు

రాష్ట్రంలోని సెకండరీ హెల్త్ పరిధిలోని ప్రభుత్వ ఆసుపత్రులను కూటమి ప్రభుత్వం వేగంగా బలోపేతం చేస్తోందని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌ తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వం ఐదేళ్ల కాలంలో వైద్య పరికరాల కోసం కేవలం రూ. 42 కోట్లు ఖర్చు చేస్తే.. ప్రస్తుత కూటమి ప్రభుత్వం కేవలం రెండేళ్ల వ్యవధిలోనే రూ. 72.81 కోట్లు కేటాయించి అత్యాధునిక సదుపాయాలు సమకూర్చిందని ఆయన ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. దీనివల్ల జిల్లా, ప్రాంతీయ, సామాజిక ఆరోగ్య కేంద్రాలలో టెలి రేడియాలజీ, సీటీ స్కాన్, ల్యాప్రోస్కొపీ వంటి అధునాతన వైద్య సేవలు అందుబాటులోకి వచ్చి బోధనాసుపత్రులపై ఒత్తిడి తగ్గుతుందని వివరించారు.