లక్నో అగ్నిప్రమాదం కేసులో విస్తుపోయే విషయాలు.. 2016లోనే భవనం కూల్చివేతకు నోటీసులు.. కానీ 2 నెలల్లోనే రద్దు

లక్నో అగ్నిప్రమాదంలో 15 మంది అమాయకుల ప్రాణాలు గాల్లో కలసిపోవడానికి దశాబ్ద కాలంగా సాగుతున్న వ్యవస్థల నిర్లక్ష్యమే కారణమని పోలీసుల దర్యాప్తులో తేలింది. ముఖ్యంగా నిబంధనలను తుంగలో తొక్కి నిర్మించిన ఈ భవనానికి 2016లోనే లక్నో డెవలప్‌మెంట్ అథారిటీ (ఎల్డీఏ) కూల్చివేత నోటీసులు ఇచ్చినా.. కేవలం రెండు నెలల్లోనే ఆ ఉత్తర్వులు రద్దయిపోవడం వెనుక ఉన్న అదృశ్య హస్తాలపై ఇప్పుడు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. నాడే అధికారులు కఠినంగా వ్యవహరించి ఉంటే.. ఇంత ఘోరం జరిగి ఉండేది కాదని బాధితు కుటుంబ సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.