లోయలో పడిపోయిన ప్రయాణికుల బస్సు.. ఏడుగురు దుర్మరణం, 12 మందికి గాయాలు

ఉత్తరాఖండ్‌లోని అల్మోరా జిల్లాలో మంగళవారం ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. ద్వారాహత్ నుంచి రామ్‌నగర్ వెళ్తున్న బస్సు.. మలుపు వద్ద అదుపుతప్పి పాతాళం లాంటి వంద అడుగుల లోయలోకి దూసుకెళ్లింది. ఈ భీకర ప్రమాదంలో ఏడుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.. మరో 12 మంది మృత్యువుతో పోరాడుతున్నారు. లోయలోని బురద, లోతైన ప్రదేశం కారణంగా సహాయక చర్యలు సవాలుగా మారినా.. పోలీసులు, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది ప్రాణాలకు తెగించి క్షతగాత్రులను బయటకు తీశారు.