శబరిమల ఎయిర్‌పోర్టు నిర్మాణానికి బ్రేక్.. భూ సేకరణ నోటిఫికేషన్ రద్దు చేసిన కేరళ హైకోర్టు

ప్రతిపాదిత శబరిమల గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్ట్ కోసం భూసేకరణ ప్రక్రియలో కేరళ ప్రభుత్వానికి పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. చెరువల్లి ఎస్టేట్‌కు చెందిన సుమారు 2,263 ఎకరాల భూమిని సేకరించేందుకు ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్‌ను కేరళ హైకోర్టు కొట్టివేసింది. ఎస్ఐఏ నివేదిక, నిపుణుల కమిటీ సిఫార్సులను కూడా హైకోర్టు పాక్షికంగా రద్దు చేసింది. చట్టంలోని నిబంధనలను అతిక్రమించి అవసరానికి మించి భూమిని సేకరించాలని చూడటంపై కేరళ సర్కార్‌ తీరుపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.