సుప్రీంకోర్టులో విజయ్‌ సర్కారుకు ఎదురుదెబ్బ.. తమిళనాడు పిటిషన్ తిరస్కరణ

కర్ణాటక ప్రభుత్వం కావేరీ నదిపై చేపట్టిన మేకెదాటు బాలెన్సింగ్ రిజర్వాయర్‌పై తమిళనాడు వ్యతిరేకత కొనసాగుతోంది. గతంలో ఈ ప్రాజెక్ట్‌పై సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును సమీక్షించాలంటూ పిటిషన్ వేసింది. దీనిని తాజాగా తిరస్కరించిన కోర్టు.. డీపీఆర్ ఆమోదం తెలపకుండా నిర్ణయం తీసుకోవడం తొందరపాటు అవుతుందని స్పష్టం చేసింది. ఇదే అంశంపై తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్‌ సైతం ప్రధాని మోదీకి లేఖ రాశారు. ప్రాజెక్టును నిలిపివేయాలని కర్ణాటకకు ఆదేశించాలని కోరారు.