సోషల్ మీడియాలో నాపై ట్రోలింగ్ చేస్తున్నారు.. హైకోర్టులో కేసు వేసిన పవన్ కల్యాణ్

సోషల్ మీడియాలో ట్రోలింగ్, వ్యక్తిత్వ హననంపై ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.. ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. తన హక్కులను కాపాడాలని పిటిషన్ దాఖలు చేశారు. పవన్ కళ్యాణ్ తరఫున సీనియర్ న్యాయవాది సాయి దీపక్ పిటిషన్ వేశారు. దీన్ని పరిశీలించిన కోర్టు.. మెటా, గూగుల్, ఎక్స్‌లకు.. ఫిర్యాదులపై చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. కాగా అసభ్యకర, విద్వేషపూరిత వ్యాఖ్యలు పెరిగిపోతున్నందున గతంలో ఏపీ హైకోర్టు కూడా కీలక ఆదేశాలు ఇచ్చింది. అలాంటి ట్రోలింగ్‌ను ఆటో బ్లాక్ చేసే విధానం తీసుకురావాలని చెప్పింది.