10 పంచాయతీల్లో డీజిల్‌ ఖర్చు రూ.56.47 లక్షలట!

మండల కేంద్రమైన వి.కోట పంచాయతీలో రూ.32.48 లక్షల డీజిల్‌ వాడారట. అలాగని స్వర్ణ పంచాయతీ మాడ్యూల్‌లో (కంటింజెంట్‌ హెడ్‌) బిల్లులు పెట్టారు. ఇలా పది పంచాయతీల్లో డీజిల్‌ ఖర్చు కింద 56.47 లక్షల రూపాయలను డ్రా చేసేశారు. ఇతర పనుల బిల్లులను ఎవరికీ అనుమానం రాకుండా ఈ పెట్రోల్‌, డీజిల్‌ ఖర్చుల మాడ్యూల్‌లో పెట్టి తీసుకున్నారు. నిబంధనలకు విరుద్ధంగా చేసిన ఈ వ్యవహారాన్ని కమిషనరు కార్యాలయం గుర్తించింది. దీంతో ఈ పది పంచాయతీల కార్యదర్శులకు షోకాజ్‌ నోటీసులు జారీ అయ్యాయి.