Election Results 2026 LIVE పశ్చిమ బెంగాల్‌లో మమతా బెనర్జీదే విజయమా? అసోంలో బీజేపీ గెలుపు ఖాయమా?

West Bengal Election Result పశ్చిమ్ బెంగాల్ ఎన్నికల ఫలితంపై యావత్తు దేశం ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తోంది. ఇక్కడ అధికార తృణమూల్‌ కాంగ్రెస్‌, బీజేపీ మధ్య హోరాహోరీ పోరు కొనసాగడంతో గెలుపు ఆసక్తికరంగా మారింది. 2011 నుంచి వరుసగా మూడుసార్లు విజయం సాధించిన టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ మళ్లీ విజయం సాధిస్తారని కొన్ని సర్వేలు వెల్లడించాయి. కాగా బెంగాల్‌లో ఈసారి బీజేపీ అధికారంలోకి వస్తుందని మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ అభిప్రాయపడ్డాయి. ఏప్రిల్ 23, 29 తేదీల్లో రెండు విడతల్లో బెంగాల్‌లో పోలింగ్ జరగ్గా.. స్వతంత్ర భారత చరిత్రలోనే అత్యధికంగా 92.47 శాతం ఓటింగ్ నమోదైంది. రాష్ట్రంలో ఎన్నికలు ముగిసిన తర్వాత కూడా ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతుండటంతో ఓట్ల లెక్కింపు కోసం దాదాపు 2.5 లక్షల కేంద్ర బలగాలను నియమించారు. అసోంలోని 126 అసెంబ్లీ స్థానాలకు ఒకే దశలో ఏప్రిల్ 9న ఎన్నికలు నిర్వహించారు. అసోంలో ఎన్డీయే కూటమి, ఏఎస్ఎం కూటమి మధ్య ప్రధానంగా పోటీ నడిచింది. ఎన్డీయే కూటమిలో బీజేపీతోపాటు అసోం గణ పరిషత్, బోడోలాండ్ పీపుల్స్ ఫ్రండ్ పార్టీలు భాగంగా ఉన్నాయి. ఈ కూటమికి సీఎం హిమంత బిశ్వ శర్మ నేతృత్వం వహించారు. ప్రతిపక్ష అసోం సన్మిలితో మోర్చా కూటమిలో కాంగ్రెస్, రైజోర్ దళ్, అసోం జాతీయ పరిషత్, లెఫ్ట్ పార్టీలు భాగంగా ఉన్నాయి. ఈ కూటమికి గౌరవ్ గొగొయ్ సారథ్యం వహించారు. ఈసారి అసోంలో 85.96 శాతం పోలింగ్ నమోదైంది.