Tamil Nadu Election Results 2026 LIVE: తమిళనాడు, కేరళం, పుదుచ్చేరి ఎన్నికల ఫలితాలు.. డీఎంకే మళ్లీ గెలుస్తుందా? లేదా విజయ్ మ్యాజిక్ చేస్తారా?

దక్షిణాదిలోని కీలక రాష్ట్రాలైన తమిళనాడు, కేరళంతోపాటు కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో ఓట్ల లెక్కింపు ప్రక్రియ కాసేపట్లో ప్రారంభం కానుంది. తమిళనాడులోని 234 అసెంబ్లీ స్థానాలకు ఏప్రిల్ 23న ఎన్నికలు నిర్వహించారు. ఈ ఎన్నికల్లో రికార్డు స్థాయిలో 85 శాతానికిపైగా ఓటింగ్ నమోదైంది. ఈసారి తమిళనాడులో త్రిముఖ పోరు జరిగింది. అధికార డీఎంకే, ప్రతిపక్ష అన్నాడీఎంకేతోపాటు విజయ్ సారథ్యంలోని టీవీకే సైతం ఎన్నికల్లో పోటీ చేసింది. దీంతో ఈ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారనేది ఆసక్తికరంగా మారింది. మెజార్టీ ఎగ్జిట్ పోల్స్ డీఎంకే విజయాన్ని అంచనా వేశాయి. మై యాక్సిస్ ఇండియా లాంటి కొన్ని ఎగ్జిట్ పోల్స్ మాత్రం విజయ్ పార్టీ గెలుస్తుందని అంచనా వేశాయి. ముఖ్యమంత్రి స్టాలిన్ నాయకత్వంలోని డీఎంకే కూటమిలో కాంగ్రెస్, వీసీకే, వామపక్షాలు కూడా భాగంగా ఉన్నాయి. పళనిస్వామి నేతృత్వంలోని అన్నాడీఎంకే కూటమిలో బీజేపీతోపాటు పీఎంకే, ఏఎంఎంకే భాగంగా ఉన్నాయి. విజయ్ పార్టీ టీవీకే ఒంటరిగా పోటీ చేసింది. సీమన్ సారథ్యంలోని నామ్ తమిళార్ కట్చి కూడా ఈ ఎన్నికల్లో పోటీ చేసింది. తమిళనాడులో అధికారంలోకి రావాలంటే కనీసం 118 సీట్లు సాధించాల్సి ఉంటుంది. ఇక కేరళం విషయానికి వస్తే.. మార్చి 16న ఎన్నికల నోటిఫికేషన్ వెలువడగా.. ఏప్రిల్ 9న ఒకే దశలో పోలింగ్ జరిగింది. ఈ ఎన్నికల్లో కేరళంలో 79.63 శాతం ఓటింగ్ నమోదైంది. కేరళంలో చాలా కాలంగా సీపీఐ(ఎం) నాయకత్వంలోని ఎల్డీఎఫ్ కూటమి, కాంగ్రెస్ సారథ్యంలోని యూడీఎఫ్ కూటమి మధ్య పోటీ జరుగుతోంది. ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఎల్డీఎఫ్ కూటమికి నాయకత్వం వహించారు. మరోవైపు బీజేపీ నాయకత్వంలోని ఎన్డీయే కూటమి సైతం కేరళంలో బలం పెంచుకోవడంపై ఫోకస్ పెట్టడంతో.. ఈసారి కేరళం అసెంబ్లీ ఎన్నికలు ఆసక్తికరంగా సాగాయి. ఎగ్జిట్ పోల్స్ ప్రకారం.. యూడీఎఫ్ కూటమికి స్వల్ప ఆధిక్యం లభించే అవకాశం కనిపిస్తోంది. కేరళం అసెంబ్లీలో మొత్తం 140 స్థానాలు ఉండగా.. మ్యాజిక్ ఫిగర్ 71గా ఉంది. కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో ఏప్రిల్ 9న ఓటింగ్ ప్రక్రియ నిర్వహించారు. తమిళనాడు ప్రభావం ఎక్కువగా ఉండే పుదుచ్చేరిలో రెండు కూటముల మధ్య పోరు ఉండగా.. విజయ్ పార్టీ సైతం పోటీలో నిలిచింది. ఎన్డీయే కూటమిలో ముఖ్యమంత్రి ఎన్. రంగస్వామి నాయకత్వంలోని ఆలిండియా ఎన్ఆర్ కాంగ్రెస్, బీజేపీ, అన్నాడీఎంకే భాగంగా ఉన్నాయి. సెక్యూలర్ ప్రొగ్రెసివ్ అలయెన్స్ (ఎస్పీఏ)లో కాంగ్రెస్, డీఎంకే భాగంగా ఉన్నాయి. విజయ్ నాయకత్వంలోని టీవీకే యువతను ఆకర్షించింది. ప్రస్తుత ముఖ్యమంత్రి అయిన ఎన్.రంగస్వామి తట్టంచవాడి, మంగళం అసెంబ్లీ స్థానాల నుంచి పోటీ చేశారు. కాంగ్రెస్ నేత, మాజీ సీఎం అయిన వైతిలింగం తట్టంచవాడిలో రంగస్వామితో నేరుగా తలపడ్డారు. పుదుచ్చేరిలో 33 అసెంబ్లీ స్థానాలు ఉండగా.. వీటిలో 30 నియోజకవర్గాలకు ఎన్నికలు నిర్వహించారు. కేంద్రం మరో 3 స్థానాలకు ఎమ్మెల్యేలను నామినేట్ చేస్తుంది. రంగస్వామి సారథ్యంలోని ఎన్డీయే కూటమి మళ్లీ అధికారంలోకి వస్తుందని మెజార్టీ ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి.