kumaram bheem asifabad- వంతెన పనులు త్వరగా పూర్తి చేయాలి

పెంచికల్‌పేట, దహెగాం మండలాల మధ్య పెద్దవాగుపై రూ.18 కోట్లతో సెంట్రల్ రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్‌తో నిర్మిస్తున్న వంతెన పనులు త్వరగా పూర్తి చేయాలని ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేష్ అన్నారు. బుధవారం ఈ పనులు ఆయన పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ వంతెన నిర్మాణం పూర్తి చేస్తే రెండు మండలాలకు అనుంసంధానం ఏర్పడుతుందన్నారు. ఈ ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయాలన్నారు. పనుల విషయంలో ఏ మాత్రం నిర్లక్ష్యం చేయరాదని తెలిపారు.