TG: ఈ కేవైసీ చేసుకుంటే రేషన్ బంద్..! సివిల్ సప్లై కమిషనర్ కీలక వ్యాఖ్యలు..

రేషన్ కార్డు ఈ కేవైసీపై సోషల్ మీడియాలో జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని నమ్మవద్దని పౌరసరఫరాల శాఖ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర స్పష్టం చేశారు. ఈ కేవైసీ చేసుకుంటే రేషన్ బియ్యం నిలిపివేస్తారనే వార్తలో వాస్తవం లేదన్నారు. కార్డులో పేరున్న ప్రతి ఒక్కరూ ఏదైనా రేషన్ షాపునకు వెళ్లి తమ వేలిముద్ర లేదా ఐరిష్ నమోదు చేసుకోవడం తప్పనిసరన్నారు. ఇతర ప్రాంతాల్లో ఉండేవారు తమకు సమీపంలోని షాపులో ఈ ప్రక్రియ పూర్తి చేయవచ్చన్నారు. వృద్ధులు, పిల్లలకు బయోమెట్రిక్ సమస్యలు ఉంటే ఆధార్ కేంద్రంలో వివరాలు అప్‌డేట్ చేయించుకోవాలని అధికారులు సూచించారు.