TMC Crisis: మమతా బెనర్జీపైనే వేటు వేసిన టీఎంసీ తిరుగుబాటు వర్గం.. కొత్త బాస్‌గా అరూప్ రాయ్ ప్రకటన!

TMC Crisis: పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో పెను సంచలనం చోటుచేసుకుంది. అధికార తృణమూల్ కాంగ్రెస్ (TMC) పార్టీపై పట్టు కోసం సాగుతున్న అంతర్గత పోరు ఇప్పుడు క్లైమాక్స్‌కు చేరింది. పార్టీ అధినేత్రి, వ్యవస్థాపకురాలు మమతా బెనర్జీ నాయకత్వానికే సవాలు విసురుతూ.. రితాబ్రతా బెనర్జీ నేతృత్వంలోని తిరుగుబాటు (రెబెల్) వర్గం సోమవారం ఓ సంచలన నిర్ణయం తీసుకుంది. ఏకంగా పార్టీ స్థాపించిన మమతా బెనర్జీని అధ్యక్ష పదవి నుంచి తొలగించి.. సీనియర్ ఎమ్మెల్యే అరూప్ రాయ్‌ను తృణమూల్ కాంగ్రెస్ అసలైన అధ్యక్షుడిగా ప్రకటిస్తూ సమాంతర కమిటీని ఏర్పాటు చేసింది. అంతటితో ఆగకుండా, ఈ సమాంతర కమిటీని ప్రకటించిన కొద్దిసేపటికే.. మమతా బెనర్జీకి అత్యంత ఆప్తుడైన పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు రెబెల్ క్యాంప్ ప్రకటించింది. ఈ పరిణామంతో ఈ తిరుగుబాటు కేవలం శాసనసభకే పరిమితం కాలేదని, పార్టీ సంస్థాగత నిర్మాణాన్ని కూడా చేతుల్లోకి తీసుకునేందుకు విస్తరించిందని స్పష్టమైంది. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో టీఎంసీ ఓటమి పాలైన తర్వాత.. శాసనసభ, పార్లమెంటరీ విభాగాల్లో వరుస వలసలు, తిరుగుబాట్లతో ఇప్పటికే తీవ్ర ఒత్తిడిలో ఉన్న మమతా బెనర్జీకి, ఈ తాజా పరిణామం తన రాజకీయ జీవితంలోనే అత్యంత తీవ్రమైన సంస్థాగత సవాలుగా మారింది.