అమెరికా టారిఫ్‌లపై త్వరలో సుప్రీంకోర్టు తీర్పు.. ప్లాన్ బీ ఉందంటూ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు

ట్రంప్ విధిస్తున్న టారిఫ్‌లకు సంబంధించి.. త్వరలోనే అమెరికా సుప్రీంకోర్టు తీర్పు వెలువరించనున్న నేపథ్యంలో.. అమెరికా అధ్యక్షుడు ప్లాన్ బీ రెడీ చేసినట్లు తెలుస్తోంది. తాను తీసుకొచ్చిన టారిఫ్ విధానం అమెరికా ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసిందని.. దాన్ని అడ్డుకోవడం అంటే చైనాను ప్రోత్సహించడమేనని ఈ సందర్భంగా ట్రంప్ ఘాటుగా వ్యాఖ్యానించారు. ఒకవేళ తీర్పు తనకు వ్యతిరేకంగా వస్తే.. పాత సుంకాల రీఫండ్ విషయంలో ఇబ్బందులు ఎదురవుతాయని.. అందుకే తాము ప్రత్యామ్నాయ చట్టాలను ఉపయోగించి టారిఫ్స్‌ను కొనసాగిస్తామని స్పష్టం చేశారు.