అమెరికాకు భారత్ కంటే ముఖ్యమైన దేశం మరొకటి లేదు: US రాయబారి సెర్గియో గోర్

భారత్‌లో అమెరికా రాయబారిగా సెర్గియో గోర్ బాధ్యతలు చేపట్టారు. ఇరు దేశాల బంధాన్ని సరికొత్త శిఖరాలకు తీసుకెళ్తామని ఈ సందర్భంగా ఆయన ప్రకటించారు. ప్రధాని మోదీ, అధ్యక్షుడు ట్రంప్‌ల మధ్య ఉన్న స్నేహం అత్యంత నిజాయితీతో కూడుకున్నదని కొనియాడారు. సాంకేతిక రక్షణ, సెమీకండక్టర్ల సరఫరా కోసం ఉద్దేశించిన ప్యాక్స్ సిలికా కూటమిలోకి భారత్‌ను ఆహ్వానించారు. ఇండియా గేట్ అందాన్ని, భారతీయుల ఆధ్యాత్మికతను ప్రశంసించిన ఆయన.. 21వ శతాబ్దపు గమనాన్ని మార్చగల శక్తి భారత్-అమెరికా భాగస్వామ్యానికే ఉందని స్పష్టం చేశారు.