అసోంలో బంగ్లాదేశ్‌తో సంబంధం ఉన్న ఉగ్రముఠా గుట్టురట్టు.. 11 మంది అరెస్ట్

అసోంలో బంగ్లాదేశ్ ఉగ్రవాద సంస్థకు చెందిన 11 మందిని పోలీసులు అరెస్ట్ చేయడంతో కలకలం రేగుతోంది. ఇమామ్ మహముదార్ కాఫిలా మాడ్యుల్ (ఐఎంకే) అనే ఈ సంస్థ, భారత్ నిషేధించిన తీవ్రవాద సమూహం జేఎంబీ అనుబంధ విభాగం. వీళ్లు సోషల్ మీడియా ద్వారా యువతను ఉగ్రవాదం వైపు ఆకర్షించి, నిధులు సమీకరిస్తున్నట్లు దర్యాప్తులో వెల్లడైంది. బంగ్లాదేశ్‌లో గతేడాది హసీనా పాలన ముగియడంతో మళ్లీ ఉగ్రమూకలు పురుడుపోసుకుంటున్నాయి. పొరుగు దేశ పరిణామాలు భారత్ భద్రతకు సవాల్‌గా మారాయి.