'ఇజ్రాయెల్‌ను దేశంగా గుర్తిస్తే నాశనమే': పాకిస్థాన్‌ను హెచ్చరించిన పహల్గాం మాస్టర్‌మైండ్ సైఫుల్లా కసూరి

మధ్యప్రాచ్యంలో మారుతున్న భౌగోళిక రాజకీయ సమీకరణాల వేళ లష్కరే తోయిబా డిప్యూటీ చీఫ్ సైఫుల్లా కసూరి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇజ్రాయెల్‌ను ఎట్టి పరిస్థితుల్లో దేశ గుర్తించవద్దని, ఒకవేళ గుర్తిస్తే దేశం పూర్తిగా నాశనం అవుతుందంటూ పాకిస్థాన్‌ను హెచ్చరించారు. ఇటీవలి జరిగిన పాక్-సౌదీ రక్షణ ఒప్పందాన్ని సైతం ఇజ్రాయెల్ వ్యతిరేక సైనిక వ్యూహంగా వక్రీకరిస్తూ.. స్థానిక జిహాదీలను రెచ్చగొట్టే ప్రయత్నం చేశాడు. ముఖ్యంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్.. అబ్రహం అక్కార్డ్స్ ఫ్రేమ్ వర్క్‌లో చేరాలంటూ పాక్‌ను ఆహ్వానించిన నేపథ్యంలోనే ఇతడీ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.