తెలంగాణలో స్థానిక ఎన్నికల సమరం మెుదలు కావటంతో.. హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి మినహా అన్ని జిల్లాల్లో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. దీంతో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల్లో బిల్లుల చెల్లింపులపై ఆందోళన మెుదలైంది. ఈ నేపథ్యంలో ఎస్ఈసీ కీలక స్పష్టత ఇచ్చింది. పనులు కొనసాగుతున్న వారికి బిల్లులు అందనున్నాయి. అయితే, కొత్త నిర్మాణాలకు, కొత్త లబ్ధిదారులకు ఎన్నికలు పూర్తయ్యేవరకు నిధులు నిలిపివేస్తారు. ఈ నియమావళి నవంబర్ 11 వరకు అమలులో ఉండనుంది.