ఉద్యోగులకు అదిరిపోయే గిఫ్ట్.. ఏకంగా రూ. 1.5 కోట్ల విలువైన ఫ్లాట్లు ఇస్తున్న టెక్ కంపెనీ!

ఉద్యోగులు కష్టపడి పనిచేస్తే ప్రశంసలు దక్కుతాయి. ఇంకా బాగా పని చేస్తే ఇంక్రిమెంట్లు వస్తాయి. కానీ చైనాకు చెందిన ఒక ఆటోమోటివ్ సంస్థ మాత్రం తన ఉద్యోగులకు కలలో కూడా ఊహించని భారీ కానుకను ప్రకటించింది. అద్దెలు కట్టలేక, సరైన నివాసం లేక ఇబ్బందులు పడుతున్న, నైపుణ్యం కలిగిన సిబ్బంది కోసం ఏకంగా రూ. 1.5 కోట్ల విలువైన లగ్జరీ ఫ్లాట్లను ఉచితంగా అందిస్తోంది. సంస్థ ఎదుగుదలకు తోడ్పడే నైపుణ్యం కలిగిన సిబ్బంది మాకు ఆస్తి.. వారు ఇళ్ల సమస్యతో మమ్మల్ని వదిలి వెళ్లకూడదు అంటూ ఆ కంపెనీ మేనేజ్‌మెంట్ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా టెక్ వర్గాల్లో చర్చనీయాంశమైంది.