ఎంత పనైంది?.. ఉపాధి కోసం యూఏఈ వెళ్తే.. భారీ వర్షాలకు బలైన భారతీయ యువకుడు

కన్నవారి కష్టాలు తీర్చాలని, కంటి నిండా కలలతో ఎడారి దేశం వెళ్లిన ఆ యువకుడిని విధి వెక్కిరించింది. కుండపోత వర్షం రూపంలో వచ్చిన మృత్యువు.. అండగా ఉంటుందని భావించిన గోడ రూపంలో అతడిని కబళించింది. యూఏఈలోని రాస్ అల్ ఖైమాలో సంభవించిన ప్రకృతి ప్రకోపానికి 27 ఏళ్ల కేరళ యువకుడు సల్మాన్ ఫారిస్ బలికావడం ప్రవాస భారతీయ సమాజంలో పెను విషాదాన్ని నింపింది. తెల్లవారుజామున ఆర్డర్ డెలివరీ కోసం వెళ్లిన సల్మాన్ బైక్ ఆగిపోవడంతో.. వర్షం నుంచి తప్పించుకోవడానికి ఒక నిర్మాణంలో ఉన్న భవనం వద్ద ఆశ్రయం పొందాడు. కానీ బలమైన గాలుల ధాటికి అదే భవనం గోడ అతడిపై కూలిపోవడంతో.. ఆ యువకుడి జీవితం అక్కడికక్కడే ముగిసిపోయింది.