ఐటీ కొలువు వదిలి వ్యవసాయం.. పిడుగుపడి టెకీ దుర్మరణం..

కర్ణాటకలో విషాద ఘటన చోటుచేసుకుంది. సాఫ్ట్‌వేర్ ఉద్యోగాన్ని వదిలి పొలంబాట పట్టిన ఓ వ్యక్తి.. అనుకోకుండా పిడుగుపాటు గురై ప్రాణాలు కోల్పోయారు. మడికేరి టౌన్‌కు చెందిన రోషన్ బాలకృష్ణ అనే వ్యక్తి ఇటీవలే ఐటీ ఉద్యోగానికి రాజీనామా చేసి.. వ్యవసాయంలోకి దిగారు. తన వ్యవసాయ కార్యకలాపాలు మరింత విస్తరించాలనే ఉద్దేశంతో మైసూరులోని ఓ పొలాన్ని పరిశీలించేందుకు కుటుంబంతో కలిసి వెళ్లారు. ఈ క్రమంలోనే ఓ మామిడి చెట్టునుంచి పళ్లు కోసేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో పిడుగుపడటంతో ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన రోషన్ కుటుంబంలో తీరని వేదన మిగిల్చింది.