ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు తీపి కబురు.. జీతాల చెల్లింపుపై మంత్రి కీలక ఆదేశాలు

తెలంగాణ ప్రభుత్వ వైద్య, ఆరోగ్యశాఖ పరిధిలో పనిచేస్తున్న వేలాది మంది ఔట్ సోర్సింగ్, కాంట్రాక్టు సిబ్బందికి రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. శానిటేషన్, సెక్యూరిటీ, పేషెంట్ కేర్ విభాగాల ఉద్యోగులకు ప్రతి నెల ఒకటో తేదీనే వేతనాలు చెల్లించాలని ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ ఆదేశించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు. దీనికోసం ఐహెచ్‌ఎఫ్‌ఎమ్‌ఎస్ పోర్టల్ పాలసీలో అవసరమైన మార్పులు చేయాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. ప్రభుత్వ తాజా నిర్ణయంతో వేలాది మంది కుటుంబాలకు ఆర్థిక భరోసా లభించనుంది.