'తాతా నువ్వు పూరీలు వేస్తేనే తింటా'.. రేవంత్ రెడ్డి మనవడి ఆర్డర్.. పూరీలు చేసి పెట్టిన సీఎం

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తన బిజీ షెడ్యూల్ పక్కన పెట్టి తన మనవడు రేయాన్ష్ కోసం వంటింట్లో గరిట పట్టారు. తాతా.. నువ్వు పూరీలు వేస్తేనే తింటా అని మనవడు ముద్దుగా అడగడంతో సీఎం రేవంత్ స్వయంగా పూరీలు చేసి పెట్టారు. వంటింట్లో మనవడు పక్కనే కూర్చుని తాతకు వంటపై సలహాలు, ఆర్డర్లు వేయడం విశేషం. దీనికి సంబంధించిన వీడియోను సీఎం ఎక్స్‌ వేదికగా పంచుకుంటూ.. ప్రజా జీవితంలో బిజీగా ఉన్న తనకు ఈ క్షణాలు ఎంతో మధురమైన జ్ఞాపకాలని పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.