కొత్త సంవత్సరం కానుక.. ప్రయాణికులకు శుభవార్త చెప్పిన మంత్రి పొన్నం.. ఇక ఈ రూట్లల్లో కూడా బస్సు సర్వీసులు..

హైదరాబాద్ నగర కనెక్టివిటీని మరింత పెంచేలా రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక ప్రకటన చేశారు. త్వరలోనే నగరవ్యాప్తంగా 370 కొత్త ప్రాంతాలకు బస్సు సర్వీసులను ప్రారంభించనున్నట్లు ఆయన వెల్లడించారు. మహాలక్ష్మి పథకంతో ఆర్టీసీకి ఆదరణ పెరిగిన నేపథ్యంలో.. ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా ఈ కొత్త రూట్లను సిద్ధం చేశారు. జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాల సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అతివేగం, మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల కలిగే ప్రమాదాల పట్ల హెచ్చరించారు. విద్యార్థులకు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించేందుకు పాఠశాలల్లో ట్రాఫిక్ అవేర్నెస్ పార్క్లను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.