కేసీఆర్‌ గుర్తిస్తే ఎంత? గుర్తించకుంటే ఎంత? చంద్రబాబుపై వ్యాఖ్యలకు ఏపీ మంత్రి కౌంటర్

ఆంధ్రప్రదేశ్‌లో అభివృద్ధి లేదని ముఖ్యంగా పెట్టుబడుల విషయంలో చంద్రబాబుపై ఇటీవల తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. తాజాగా, ఈ వ్యాఖ్యలపై మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తీవ్రంగా స్పందించారు. లక్షల కోట్ల పెట్టుబడులతో రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకెళ్తుంటే కేసీఆర్ విమర్శలు చేయడం దురదృష్టకరమని అన్నారు. చంద్రబాబు నాయుడుని ప్రపంచ దేశాలు స్టేట్స్‌మెన్‌గా గుర్తించాయని, కేసీఆర్ గుర్తిస్తే ఎంత? గుర్తించకుంటే ఎంత? అని ఘాటుగా వ్యాఖ్యానించారు.