కేసీఆర్‌కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి.. ‘దమ్ముంటే రా తేల్చుకుందాం..’

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వ్యాఖ్యలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ధీటుగా బదులిచ్చారు. పదేళ్ల పాలనలో తెలంగాణను రూ. 8 లక్షల కోట్ల అప్పుల్లోకి నెట్టిన కేసీఆర్ ఒక ఆర్థిక ఉగ్రవాది అని రేవంత్ మండిపడ్డారు. కలుగులో దాక్కున్న ఎలుకలా ఇన్నాళ్లూ మౌనంగా ఉండి.. ఇప్పుడు బయటకు వచ్చి అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. దమ్ముంటే జనవరి 2న జరిగే అసెంబ్లీ సమావేశాలకు రావాలని.. తెలంగాణకు ఎవరు మేలు చేశారో అక్కడే తేల్చుకుందామని సవాల్ విసిరారు. పంచాయతీ ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పినా కేసీఆర్ తీరు మారలేదని.. కమీషన్ల కోసమే రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారని రేవంత్ రెడ్డి ఘాటుగా విమర్శించారు.