గ్రామ పంచాయతీలకు సంక్రాంతి కానుక.. శుభవార్త చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి..

తెలంగాణ ప్రభుత్వం సంక్రాంతి కానుకగా గ్రామ పంచాయతీలకు రూ. 277 కోట్ల నిధులను విడుదల చేసింది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశాల మేరకు ఆర్థిక శాఖ ఈ నిధులను మంజూరు చేసింది. 2025 డిసెంబర్‌లో ఎన్నికైన కొత్త పాలకవర్గాలకు ఇది మొదటి భారీ కేటాయింపు. ఈ నిధులను పల్లెల్లో పారిశుధ్యం, వీధి దీపాలు మరియు ఇతర మౌలిక సదుపాయాల అభివృద్ధికి వినియోగించాలని ప్రభుత్వం సూచించింది. ఇచ్చిన మాట ప్రకారం బాధ్యతలు చేపట్టిన నెలలోనే నిధులు ఇవ్వడంపై సర్పంచులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.