తెలంగాణకు మరో భారీ పెట్టుబడి.. రూ. 9,000 కోట్లతో కొత్త ప్లాంట్..

తెలంగాణ రాష్ట్రానికి మరో భారీ పెట్టుబడి ఖరారైంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో అమెరికాకు చెందిన ప్రముఖ ఫార్మా సంస్థ ఎలి లిల్లీ (Eli Lilly) ప్రతినిధులు భేటీ అయ్యారు. హైదరాబాద్‌లో రూ.9,000 కోట్లతో ఒక ప్లాంట్, క్వాలిటీ సెంటర్‌ను ఏర్పాటు చేసేందుకు అంగీకరించింది. ఇది రాష్ట్రానికి పెద్ద మొత్తంలో ఉపాధి అవకాశాలను అందిచనుంది. ప్రభుత్వం ఫార్మా పాలసీని మరింత మెరుగుపరిచి.. ఆనంద్ మహీంద్రా నేతృత్వంలో స్కిల్ యూనివర్సిటీని ఏర్పాటు చేయడం ద్వారా పరిశ్రమకు అవసరమైన నైపుణ్య సహకారం అందిస్తామని సీఎం తెలిపారు.