తెలంగాణలో జులై 15 నుంచి కొత్త పథకం.. వారం రోజుల్లో మార్గదర్శకాలు

తెలంగాణలో ఉద్యోగుల ఆరోగ్య పథకం జులై 15 నుంచి ప్రారంభం కానుంది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు అధ్యక్షతన శనివారం సచివాలయంలో జరిగిన ఉద్యోగుల హెల్త్‌కేర్‌ ట్రస్ట్‌ తొలి సమావేశంలో ఈ మేరకు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. భార్యాభర్తలిద్దరూ ఉద్యోగులైతే ఒక్కరి నుంచి మాత్రమే చందా వసూలు చేయాలని గత నెలలో అదనంగా మినహాయించిన మొత్తాన్ని తిరిగి చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది. చికిత్స గరిష్ఠ పరిమితిని రూ.5 లక్షలకు పెంచాలని మరిన్ని వ్యాధులు, ఆసుపత్రులను ఈ పథకం పరిధిలోకి తీసుకురావాలని వివిధ సంఘాల నాయకులు ఈ సందర్భంగా అధికారులకు వినతిపత్రాలు సమర్పించారు.