ద్వేషపూరిత ప్రసంగాలిస్తే భారీ జరిమానాలు, వీసా రద్దు.. బోండి బీచ్ దాడితో ఆస్ట్రేలియా ప్రభుత్వం కఠిన నిర్ణయం

ఆస్ట్రేలియా సిడ్నీలోని బోండి బీచ్‌లో ఐసిస్ (ISIS) ప్రేరేపిత ఉగ్రవాదులు జరిపిన కాల్పుల ఘటన ఆ దేశ భద్రతా వ్యవస్థనే గడగడలాడించింది. ఈ దాడిలో బలైన 10 ఏళ్ల మటిల్డా అంత్యక్రియలు గురువారం వేలాది మంది కన్నీటి వీడ్కోలు మధ్య ముగిశాయి. అయితే ఈ విషాదంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన ప్రధాని ఆంథోనీ అల్బనీస్.. దేశంలో పెరుగుతున్న విద్వేష ప్రసంగాలపై యుద్ధం ప్రకటించారు. విద్వేషం రగిల్చే వారిని కఠినంగా శిక్షించడమే కాకుండా విదేశీయులైతే వారి వీసాలను వెంటనే రద్దు చేసి దేశం నుంచి తరిమివేసేలా కొత్త చట్టాలను తీసుకురాబోతున్నారు.