"నా భర్త తలపై పెట్రోల్ పోసి నిప్పు పెట్టారు": బాంగ్లాదేశ్ బాధితుడి భార్య కన్నీటి పర్యంతం!

బాంగ్లాదేశ్‌లో మైనారిటీల ఆక్రందనలు అరణ్య రోదనలుగా మారుతున్నాయి. మేము హిందువులం.. ప్రశాంతంగా జీవించాలనుకోవడం మా తప్పా? అంటూ 50 ఏళ్ల ఖోకాన్ చంద్ర దాస్ భార్య సీమా దాస్ అడుగుతున్న ప్రశ్నలు ఇప్పుడు యావత్ ప్రపంచాన్ని కలచివేస్తున్నాయి. బుధవారం రాత్రి తన షాపు మూసివేసి ఇంటికి వస్తున్న ఖోకాన్‌ను అడ్డగించిన ఒక ఉన్మాద మూక మారణాయుధాలతో నరికి.. ఆపై తల, ముఖంపై పెట్రోల్ పోసి నిప్పు పెట్టింది. చావు అంచుల దాకా వెళ్లిన ఆయన.. సమీపంలోని చెరువులోకి దూకి మంటల నుంచి తనను తాను రక్షించుకున్నా.. ప్రస్తుతం ఢాకా ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడుతున్నారు.