'పనికిరాని ప్రశ్నలు అడక్కండి': కలుషిత నీటి గురించి ప్రశ్నించిన జర్నలిస్టుపై మధ్య ప్రదేశ్ మంత్రి ఫైర్

మధ్యప్రదేశ్‌లో అత్యంత పరిశుభ్రమైన నగరంగా పేరొందిన ఇండోర్‌ భగీరథ్‌పురలో పెను విషాదం చోటుచేసుకుంది. తాగునీటి పైపులైన్లలో డ్రైనేజీ నీరు కలవడంతో ఆ నీరు తాగిన దాదాపు 1,400 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. మృతుల సంఖ్యపై ప్రభుత్వం ఏడుగురు అని చెబుతుండగా.. స్థానికులు మాత్రం 13 మంది బలి అయ్యారని ఆరోపిస్తున్నారు. ఈ కలుషిత నీటి మృత్యుఘోషపై క్షేత్ర పర్యటనకు వచ్చిన మంత్రి కైలాశ్‌ విజయ్‌ వర్గీయ.. బాధితుల చికిత్స ఖర్చుల గురించి ప్రశ్నించిన జర్నలిస్టుపై పనికిరాని ప్రశ్నలు అడగవద్దు అంటూ దురుసుగా ప్రవర్తించి కొత్త వివాదానికి తెరలేపారు.