‘నాకు విషమిచ్చి చంపేయండి’.. మంత్రి కోమటిరెడ్డి ఆవేదన..

మీడియాలో వస్తున్న ఆరోపణలపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ‘వ్యూస్, రేటింగ్స్ కోసం మహిళా అధికారులపై దుష్ప్రచారం చేయడం తగదని.. ఇంకా తనివి తీరకపోతే నాకింత విషమిచ్చి చంపేయండి’ అంటూ భావోద్వేగానికి లోనయ్యారు. మహిళా ఐఏఎస్ అధికారులకు కుటుంబాలు ఉంటాయని.. వారి ఆత్మగౌరవాన్ని దెబ్బతీయవద్దని కోరారు. తన గొంతు సమస్య వల్ల తక్కువగా మాట్లాడుతున్నానని.. ఫోన్ నంబర్ మార్చలేదని స్పష్టం చేశారు. కలెక్టర్ల బదిలీలు సీఎం పరిధిలో జరుగుతాయన్నారు. రాజకీయాల కంటే ప్రజల సేవకే ప్రాధాన్యత ఇస్తున్నానని.. అనవసరంగా తనను మానసిక హింసకు గురి చేయవద్దని ఆయన మీడియాను వేడుకున్నారు.