"నాన్నా ఇక్కడంతా మంటలు.. నన్ను కాపాడు": లక్నో అగ్నిప్రమాదంలో చనిపోయిన యువకుడి ఆఖరి ఫోన్ కాల్

లక్నోలోని అలీగంజ్ పరిధిలో సోమవారం సంభవించిన ఓ ఘోర అగ్నిప్రమాదం దేశవ్యాప్తంగా పెను విషాదాన్ని నింపింది. గ్రౌండ్ ఫ్లోర్‌లోని దుకాణాల నుంచి ఒక్కసారిగా పై అంతస్తులకు అగ్నికీలలు వ్యాపించడంతో.. ఊపిరాడక, బయటపడే దారిలేక బిల్డింగ్‌ లోపలే విద్యార్థులు విలవిలలాడారు. మృత్యువు అంచుల్లో నిలబడి 23 ఏళ్ల యువకుడు సుఖ్‌మణి సింగ్ నాన్న.. నన్ను కాపాడు అంటూ తండ్రికి చేసిన ఆఖరి ఫోన్ కాల్ ప్రతి ఒక్కరినీ కన్నీరు పెట్టిస్తోంది. మరోవైపు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.