పండుగ పూట ఎంతటి విషాదం.. చైనా మాంజా గొంతుకు చుట్టుకుని బైకర్ మృతి, చివరిమాటలివే..!

పండుగపూట కర్ణాటకలో తీవ్ర విషాదం నెలకొంది. రోడ్డుపై వెళ్తున్న ఓ 48 ఏళ్ల వ్యక్తిని గాలిపటం దారం చంపేసింది. ముఖ్యంగా రోడ్డుకు అడ్డంగా కట్టినట్లున్న ఓ చైనీస్ మాంజా.. ఆయన గొంతును కత్తిలా కోసేసింది. దీంతో తీవ్ర రక్తస్రావమై రోడ్డుపై కుప్పకూలిన ఆయన.. ప్రాణాలు పోతున్నాయని తెలిసినా వణుకుతున్న చేతులతో తన కూతురికి ఫోన్ చేశారు. అమ్మా.. నన్ను క్షమించు.. మీ అమ్మను జాగ్రత్తగా చూసుకో అని ఆయన చెప్పిన ఆఖరి మాటలు ఇప్పుడు దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరినీ కంటతడి పెట్టిస్తున్నాయి.