పేదల సంక్షేమమే ప్రజాప్రభుత్వ ధ్యేయం
పేదల సంక్షేమమే ప్రజాప్రభుత్వ ధ్యేయమని, అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు అందజేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని పంచాయతీరాజ్‌శాఖ మంత్రి సీతక్క అన్నారు. శుక్రవారం భద్రాద్రికొత్తగూడెం, ములుగు జిల్లాల్లో ఆమె పర్యటించారు.