పహల్గామ్ దాడికి పాక్ నుంచే ప్లాన్, సూత్రధారి లష్కరే చీఫ్.. ఎన్ఐఏ అనుబంధ ఛార్జిషీట్‌

జమ్మూ కశ్మీర్‌ అనంత్‌నాగ్ జిల్లా పహల్గామ్‌లోని బైసరన్ లోయలో పాకిస్థాన్ ఉగ్రవాదులు మారణహోమానికి తెగబడి 26 మంది అమాయకులను పొట్టనబెట్టుకున్నారు. ఈ ఘటనపై యావత్తు దేశం ప్రతీకారంతో రగిలిపోయింది. దీనికి ఇంతకు ఇంత బదులు తీర్చుకోవాలని, పాక్ అండతో రెచ్చిపోయిన ముష్కర మూకల భరతం పట్టాలని డిమాండ్ చేసింది. ఈ కేసును దర్యాప్తు చేస్తోన్న ఎన్ఐఏ.. తాజాగా కోర్టులో అనుబంధం ఛార్జ్‌షీట్‌ దాఖలు చేసింది. ఇందులో లష్కరే తొయిబా చీఫ్ పేరును చేర్చింది.