నియోజకవర్గంలో ప్రధానమైన బీఎన్ రహదారి దుస్థితిపై స్థానిక న్యాయవాదులు దాఖలు చేసిన కోర్టు కేసులో రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శితో పాటు ఆర్ అండ్‌బీ స్పెషల్ చీఫ్ సెక్రటరీని నవంబరు 15న వ్యక్తిగతంగా కోర్టు ముందు హాజరుకావాలని స్థానిక 9వ అదనపు జిల్లా కోర్టు జడ్జి హరినారాయణ శనివారం నోటీసులు జారీ చేశారు. బీఎన్ రోడ్డు పనుల్లో అధికారులతో పాటు కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వలన సామాన్య ప్రజానీకం పడుతున్న ఇబ్బందులపై స్థానిక బార్ అసోసియేషన్ న్యాయవాదులు కాండ్రేగుల డేవిడ్, భరత్‌భూషణ్, తదితరులు ఈ ఏడాది జూలై నెలలో దాఖలు చేసిన కేసులో జిల్లా కలెక్టర్ సహా ఆర్అండ్బీ అధికారులు కోర్టు ఎదుట హాజరుకావాలని జిల్లా జడ్జి ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే.