బెంగళూరులో వర్ష బీభత్సం.. ఆసుపత్రి గోడ కూలి 8 మంది మృతి

దేశ ఐటీ రాజధాని బెంగళూరులో బుధవారం కురిసిన వర్షంతో జనం వణికిపోయారు. ఉరుములు, మెరుపులు, వడగండ్లతో కూడిన వర్షం కురిసింది. ఈ వర్షానికి ఓ ప్రభుత్వ ఆసుపత్రి గోడ పక్కన నిలబడిన కొందరు ప్రాణాలు కోల్పోయారు. గోడకూలి వారిపై పడటంతో ఏడుగురు స్పాట్‌లోనే చనిపోయారు. మరికొందరు గాయపడ్డారు. శిథిలాల కింద చిక్కుకున్నవారిని స్థానికుల సాయంతో పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది బయటకు తీశారు. పలు ప్రాంతాల్లో కురిసిన వర్షానికి భారీగా ట్రాఫిక్ స్తంభించిపోయింది.