బీబీసీకి ట్రంప్ బిగ్ షాక్: తన ప్రసంగాన్ని మార్చారంటూ దావా.. రూ.90 వేల కోట్లు డిమాండ్

అంతర్జాతీయ మీడియా సంస్థ బీబీసీపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలనాత్మక పరువు నష్టం దావా వేశారు. 2021 క్యాపిటల్ హిల్‌ దాడి సందర్భంగా తాను చేసిన ప్రసంగాన్ని తప్పుడు అర్థం వచ్చేలా మార్చి, ప్రసారం చేసిందంటూ ఆయన బీబీసీని ఫెడరల్ కోర్టుకు లాగారు. బీబీసీ ఎడిటింగ్ కారణంగా తన పరువుకు నష్టం జరిగిందని ఆరోపిస్తూ.. ట్రంప్ ఏకంగా 10 బిలియన్ డాలర్లు (భారత కరెన్సీ ప్రకారం రూ.90 వేల కోట్లు) నష్ట పరిహారం డిమాండ్ చేశారు. శాంతియుత నిరసనకు పిలుపునిచ్చిన తన మాటలను ఉద్వేగభరితంగా మార్చడం ద్వారా బీబీసీ ఫ్లోరిడా చట్టాలను ఉల్లంఘించిందని ట్రంప్ తరఫు న్యాయవాదులు తమ 46 పేజీల దావాలో వాదించారు.