భారత్‌ది ఆత్మాభిమానం.. సుంకాల ఒత్తిడిపై అమెరికాకు రష్యా కౌంటర్

అమెరికా సుంకాల ఒత్తిడిలోనూ భారత్ రష్యా నుంచి చమురు కొనుగోళ్లను కొనసాగించడాన్ని మాస్కో సమర్థించింది. భారత్ ఆత్మాభిమానాన్ని ప్రశంసించిన రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్, ఇరు దేశాల భాగస్వామ్యానికి ఎలాంటి ముప్పులేదని స్పష్టం చేశారు. ఇంధన ఎంపికలు, ఇతర దేశాలతో వాణిజ్య సంబంధాలపై భారత్ స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకుంటుందని ఆయన తేల్చిచెప్పారు. ఈ క్రమంలో అమెరికా తన చమురును భారత్‌కు అమ్మాలనుకుంటే ప్రతిపాదనలు తీసుకొస్తే అందుకు చర్చలపై సిద్ధంగా ఉన్నామని జైశంకర్ అన్న మాటలను ప్రశంసించారు.