మళ్లీ పోలీసుల అదుపులోకి యూట్యూబర్ ప్రశ్న రావణ్.. బెయిల్ వచ్చిన కాసేపటికే ఐదోసారి అరెస్ట్

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌పై అనుచిత వ్యాఖ్యల ఆరోపణలతో అరెస్టయిన యూట్యూబర్ ప్రశ్న రావణ్ అలియాస్ జోసెఫ్ అరెస్టుల పర్వం ఆంధ్రప్రదేశ్‌లో తీవ్ర రాజకీయ దుమారం రేపుతోంది. ఇప్పటికే నాలుగు సార్లు బెయిల్ పొందిన రావణ్‌ను.. శనివారం రాత్రి ఎలమంచిలి కోర్టు బెయిల్ మంజూరు చేసిన కొద్దిసేపటికే ఏలూరు పోలీసులు నక్కపల్లి టోల్‌ప్లాజా వద్ద ఐదోసారి అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో ఆయన ఆమరణ నిరాహార దీక్షకు దిగడం, నటుడు ప్రకాష్ రాజ్ ఈ అరెస్టులను తప్పుబట్టడం, మంత్రి కందుల దుర్గేష్ వీరిద్దరినీ సంఘ విద్రోహ శక్తులుగా అభివర్ణించడంతో ఈ వ్యవహారం మరింత ముదిరింది.