యూపీలో పూర్తైన ఎస్ఐఆర్.. 2.89 కోట్ల ఓటర్లు తొలగింపు, ఓటర్ల జాబితాలో భారీ ప్రక్షాళన!

ఉత్తర్‌ప్రదేశ్‌లో ఓటర్ల జాబితా ప్రక్షాళనలో భాగంగా నిర్వహించిన సర్వేలో 2.89 కోట్ల మంది ఓటర్ల లెక్క తేలకపోవడం ఇప్పుడు దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. వీరంతా మరణించినట్లు, వలస వెళ్లినట్లు, ఆచూకీ లేనట్లు గుర్తించారు. యూపీలోని మొత్తం ఓటర్లలో ఈ సంఖ్య దాదాపు 19 శాతంగా ఉండటం గమనార్హం. వచ్చే ఏడాది ఫిబ్రవరి చివర్లో విడుదల చేయనున్న తుది ఓటర్ల జాబితాలో దాదాపు 3 కోట్ల మందిని తొలగించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ భారీ ప్రక్షాళన ద్వారా రాబోయే ఎన్నికల నాటికి ఓటర్ల జాబితాలో పారదర్శకత తీసుకురావడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోంది.